‘లొకేషన్‌లో సిగరెట్ తాగొద్దని ఆ నటికి చెప్పాను’

14 Jul, 2021 15:44 IST|Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్‌ వ్యవహర శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లలేదు. ఇటీవల ఈ అమ్మడు నటీనటులుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతుంది. ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లో ఉండే మీరా ఈ సారి పరోక్షంగా వార్తల్లోకెక్కింది. తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ఓ చిత్రంలో తన అనుసరిస్తున్న పద్ధతిని మార్చుకోవాలంటూ సదరు చిత్ర దర్శకుడు వార్నింగ్‌ ఇచ్చాడంట.

మీరా మిథున్‌ మొదట మోడలింగ్‌ రంగంలో రాణించి ఆ తర్వాత తమిళ వెండితెరపై మెరిసింది. ఈ క్రమంలోనే ఆమెకు తమిళ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడ తనదైన మార్కుతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం మీరా ‘పేయైు కాణోమ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కౌశిక్‌ అనే యువకుడు తొలిసారి హీరోగా పరిచయం కానున్నాడు. అన్బరసన్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగానే సిగరెట్‌ తాగే అలవాటు ఉన్న మీరా, ఇటీవల షూటింగ్‌ లొకేషన్‌లో  సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కడంపై దర్శకుడు కాస్త అసహనం వ్యక్తం చేశాడట. 

‘సిగరెట్‌ తాగడం, ఆమె వ్యక్తిగత వ్యవహారం. షూటింగ్‌ లొకేషన్‌లోనే అలా సిగెరెట్లు తాగడం సరికాదని, కేరవాన్‌లో తాగి రావాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఇది రిపీట్‌ చేయలేద’ని సదరు దర్శకుడు తెలిపారు. కాగా ఇటీవల కంగనా రనౌత్‌పై మీరా తీవ్ర విమర్శలు చేసింది. జయలలిత పాత్రలో నటించే అర్హతే కంగనకు లేదని పేర్కొంటూ ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయటమే పెద్ద తప్పని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు