Yuvaraj Dhayalan: 'ఆ మూవీ డిజాస్టర్‌.. మూడు గంటలు వృథా చేశాననిపించింది'

27 Sep, 2023 19:00 IST|Sakshi

పోటాపోటీ(2011) సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ దర్శకుడు యువరాజ్ దయాలన్. ప్రస్తుతం ఇరుగపాట్రు అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతకుముందు తెనాలిరామన్(2014), ఇలీ(2015) చిత్రాలను తెరకెక్కించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ఇరుగపాట్రు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న యువరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో తాను నిద్రపోకుండా చేసింది ఆ సినిమానే అని అన్నారు. 

(ఇది చదవండి: కత్రినా కైఫ్‌ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌)

యువరాజ్ మాట్లాడుతూ..' దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ స్టేజ్‌పైకి వచ్చాను. ఈ గత ఎనిమిదేళ్లలో నన్ను నిద్రపోనివ్వనిది ఒకటి ఉంది. అదే నా లాస్ట్ మూవీ ఎలి. ఆ రోజు ప్రెస్ షోకి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. అప్పుడే నేను, వడివేలు థియేటర్ బయటే ఉన్నాం. అయితే ఆ రోజు ఎవరూ బయటకు రాలేదు. అలా నేనూ వడివేలు థియేటర్‌లోకి వెళ్లాం. సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని నేను అడిగా. అంతా నిశ్శబ్దం. చాలా రోజుల తర్వాత ఇలాంటి నిశ్శబ్దాన్ని చూశా. అయితే ఒక సినిమా తర్వాత ప్రేక్షకులు మౌనంగా ఉంటే దాని అర్థం కేవలం రెండు విషయాలు మాత్రమే. ఒకటి అది ప్రపంచ స్థాయి సినిమా అయి ఉండాలి లేదా దానికి విరుద్ధంగానైనా ఉండాలి. వారి మౌనానికి కారణం.. నేను రెండోదే తీసుకున్నా.'అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

(ఇది చదవండి: సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ సందేశం వచ్చేసింది)

ఆ సినిమా పరాజయం కొన్నేళ్లపాటు నిద్ర లేకుండా చేసిందని చెప్పారు. వాళ్ల నిశ్శబ్దం నన్ను చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. ఈ సినిమాతో వాళ్ల జీవితంలోని మూడు గంటలు వృథా చేశానని అనిపించింది. అందుకే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరుగపట్రు నిర్మాతల సహకారంతోనే తాను మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. 

అయితే వడివేలుతో తెరకెక్కించిన తెనాలి రామన్‌ సక్సెస్ కావడంతో.. మళ్లీ వడివేలుని కథానాయకుడిగా పెట్టి ఇలి రూపొందించాడు. 2015లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరుగపట్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, శ్రద్ధా శ్రీనాథ్, విక్రాంత్, అబర్నతి, శ్రీ, సానియా అయ్యప్పన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్‌ 6న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు