బాలీవుడ్‌ రీమేక్‌.. బెల్లంకొండ బ్రదర్‌తో కృతిశెట్టి?

17 May, 2021 21:02 IST|Sakshi

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ మూవీ షూటింగ్‌ దశలో ఉండగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా గణేష్‌ హీరోగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా 2006లో షాహిద్ క‌పూర్‌, అమృతారావు జంట‌గా న‌టించిన చిత్రం ‘వివాహ్’ అనే బాలీవుడ్‌ మూవీని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి  రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారట. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్‌కు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేయనున్నట్లు సమాచారం.  

తొలి చిత్రం ఉప్పెనతో సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న కృతిశెట్టి అయితే ఈ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుందని మేకర్స్‌​ భావిస్తున్నారట. దీంతో దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, కృతి కూడా దీనికి పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మంగళూరు బ్యూటీ చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి.  ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెర‌కెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు న‌టిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో న‌టిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

చదవండి : Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు?
శాండల్‌ వుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు