Sumanth: విజయేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా సుమంత్‌ ‘అహం రీ బూట్‌’ ఫస్ట్‌లుక్‌

25 Apr, 2022 19:21 IST|Sakshi

సుమంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘అహాం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ ఫస్ట్‌లుక్‌ విడదుల చేశారు మేకర్స్‌. ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా సుమంత్‌ లుక్‌ను లాంచ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో సుమంత్ లుక్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతుండగా.. సుమంత్‌ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కకినిపంచాడు.

చదవండి:  సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్‌, షూటింగ్ స్టార్ట్‌

చూస్తుంటే ఇందులో సుమంత్... సాయం కోరే వాళ్లతో మాట్లాడుతూ వారి సమ్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది! ఈ సంద‌ర్బంగా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కాన్సెప్ట్ విన‌గానే చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇలాంటి క‌థ‌ల‌కు ఇప్పుడు డిమాండ్ మ‌రింత పెరిగింది.  సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో న‌టిస్తున్న సుమంత్ కి అభినంద‌న‌లు’ అన్నారు. అనంతరం నిర్మాతలు ర‌ఘువీర్, సృజ‌న్ య‌ర‌బోలు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్‌తో పాటు మూవీ టీంకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

చదవండి: లీకైన నిహారిక న్యూలుక్‌ ఫోటోలు.. నెట్టింట వైరల్‌

ద‌ర్శ‌కుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. ‘అహాం రీ బూట్‌తో ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియన్స్‌ను అందించ‌బోతున్నాం. అనుకోని సంఘ‌ట‌ల‌ను మ‌నిషిలోని కొత్త కోణాల‌ను , శ‌క్తుల‌కు బ‌య‌ట‌కు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి క‌థే అహాం రిబూట్. సుమంత్ న‌ట‌న చాలా హైలెట్‌గా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా ఈ క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జయిట్‌మెంట్‌ మా టీం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీ​కి శ్రీరామ్‌ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు