సీనియర్‌ నటి జయకుమారి దీనస్థితి.. దెబ్బతిన్న కిడ్నీలు.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో..

18 Sep, 2022 14:59 IST|Sakshi
జయకుమారి (ఫైల్‌) 

చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో సీనియర్‌ నటి జయకుమారి (70) చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు. వివరాలు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో నాడోడి చిత్రంతో నటిగా పరిచయం అయిన ఆమె ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్‌ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.

జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఈయన చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా ఈమెకు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. 
చదవండి: పుష్ప భామకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..!

మరిన్ని వార్తలు