సినిమా జాతర మొదలైంది... ఈ వారం ఏకంగా 9 చిత్రాలు విడుదల

12 Aug, 2021 15:19 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో, థియేటర్స్‌ కి మెల్ల మెల్లగా పూర్వవైభవం వస్తోంది. కరోనా భయాన్ని వదిలి ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తుండటంతో నిర్మాతలు కూడా ఎలాంటి సందేహం లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. గత శుక్రవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో కిరణ్‌ అబ్బవరం నటించిన ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మిగతా చిత్రాలు పర్వాలేదనిపించాయి.

ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వస్తుండడంతో నిర్మాతలు పోటీపడి మరీ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 13) అయితే ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో సుందరి, బ్రాందీ డైరీస్, సలాం నమస్తే, చైతన్య, రావే నా చెలియా, ఒరేయ్ బామర్ది, ది కంజూరింగ్ 3 ఉన్నాయి. శనివారం(ఆగస్ట్‌ 14) విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ సినిమా విడుదలవుతోంది. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైతన్న సినిమా కూడా శనివారమే వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. మరి ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో ఎవరు నిలుస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు