ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి

6 Apr, 2021 02:42 IST|Sakshi
ప్రభాస్‌

‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ సినిమాల షూటింగ్స్‌తో ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌  డైరెక్షన్లో ప్రభాస్‌ నటించే సినిమా ఆరంభమవుతుంది. అయితే ఈ మూడు చిత్రాల తర్వాత ప్రభాస్‌ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికే బాలీవుడ్‌ డైరెక్టర్‌ ‘వార్‌’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ పేరు వినిపిస్తోంది.

తాజాగా తమిళ ‘మానగరం, ఖైదీ, మాస్టర్‌’ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ అనే సినిమా చేస్తున్నారు లోకేష్‌. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో లోకేష్‌ చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆరంభమవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రభాస్‌కి లోకేష్‌ ఓ స్టోరీలైన్‌ చెప్పారట. అది ప్రభాస్‌కి నచ్చిందని, పూర్తి కథ సిద్ధం చేయమని కోరారని టాక్‌. మరి... ప్రభాస్, లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

మరిన్ని వార్తలు