లవ్లీ లుక్స్‌.. టెరిఫిక్‌ టీజర్స్‌

16 Jan, 2021 05:54 IST|Sakshi

పండగకు బోలెడు పిండి వంటలు.. భోజన ప్రియులకు భలే సంతోషం. మరి సినీ ప్రియులకు? లవ్లీ లుక్స్‌.. టెరిఫిక్‌ టీజర్స్‌   వడ్డించింది సినిమా ఇండస్ట్రీ. ఆ విశేషాలేంటో టేస్ట్‌ చేయండి.

వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నారప్ప’. సురేష్‌ బాబు, కలైపులి యస్‌. థాను నిర్మాతలు. కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, వేసవిలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రుతీహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటించారు. ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటీమార్‌’ పోస్టర్‌ రిలీజ్‌ అయింది. ఇందులో తమన్నా కథానాయిక.       టనితిన్‌ చెస్‌ ఛాంపియన్‌గా చంద్రశేఖర్‌ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది.

నితిన్, కీర్తీ సురేశ్‌ జోడీగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘రంగ్‌ దే’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఆదీ సాయికుమార్, సురభి జంటగా శ్రీనివాస్‌ నాయుడు తెరకెక్కించిన చిత్రం ‘శశి’. ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, ఈ వేసవిలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

నాగ శౌర్య, కేతికా శర్మ జంటగా సంతోష్‌ జాగర్లపుడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంక్రాంతి సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పవర్‌ ప్లే’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను రానా విడుదల చేశారు.

అదిత్‌ అరుణ్, శివానీ రాజశేఖర్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సైబర్‌ థ్రిల్లర్‌ ‘డబ్యూ డబ్ల్యూ డబ్ల్యూ’. కేవీ గుహన్‌ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను మహేశ్‌బాబు విడుదల చేశారు.

‘మత్తు వదలరా’తో పరిచయమయ్యారు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి. తాజాగా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలయింది. మణికాంత్‌ గిల్లి దర్శకుడు. మార్చిలో సినిమా విడుదల.

కమెడియన్‌ సత్య హీరోగా చేస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. హీరో సందీప్‌ కిషన్‌ ఓ నిర్మాత. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

మధు చిట్టి, మమత, ఉమా ముఖ్య పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘జాతీయ రహదారి’. çఫస్ట్‌లుక్‌ను సి.కల్యాణ్‌ విడుదల చేశారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు