పదేళ్ల కల నెరవేరింది

24 Nov, 2020 00:49 IST|Sakshi

ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఏడడుగులు వేశారు. వారిది ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని శ్రీమణి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. పదేళ్లుగా ఈ మూమెంట్‌ కోసం ఎదురుచూశాం.. మా కల నెరవేరింది.

మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌’’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు శ్రీమణి. ఆయన ట్వీట్‌కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్పందిస్తూ, ‘శ్రీమణీ.. నీ రొమాంటిక్‌ లిరిక్స్‌ వెనక ఉన్న సీక్రెట్‌ ఇప్పుడు అర్థం అయ్యింది. ‘ఇష్క్‌ షిఫాయా’ అని పాడి, ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్‌ చేసి, ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. హ్యాపీ మ్యూజికల్‌ మ్యారీడ్‌ లైఫ్‌’ అని పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు