రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీకి హీరో నాని సాయం

30 Sep, 2021 15:31 IST|Sakshi

అక్టోబర్‌ 2న నాని చేతుల మీదుగా ‘మానాడు’ట్రైలర్‌

తమిళ స్టైలీష్‌ స్టార్‌ శింబు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘మానాడు’. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి’ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

 యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్, మొదటి సింగిల్ విడుదలై మంచి ఆదరణ పొందాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు. అలాగే తమిళ ట్రైలర్‌ ఎ.ఆర్‌. మురుగదాస్‌, మలయాళంలో నివిన్‌ పాలి, కన్నడలో రక్షిత్‌ శెట్టి రిలీజ్‌ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు