Madhuri Dixit : 53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్‌

5 Oct, 2022 15:22 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ ముంబైలోని లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పనులు కూడా పూర్తయ్యాయి.  5384 చ‌ద‌ర‌పు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో  స్విమ్మింగ్ పూల్స్, ఫుట్‌బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట.

అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖ‌రీదు చేసిన అపార్ట్‌మెంట్ నుంచి అరేబియా స‌ముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ త‌న వెబ్‌సైట్‌లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్‌ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించింది.   

మరిన్ని వార్తలు