Mahaveerudu OTT: 'మహావీరుడు' ఓటీటీ తేదీ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

7 Aug, 2023 11:15 IST|Sakshi

మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నెలలోపే.. స్మాల్ స్క్రీన్ పై సందడికి టైమ్ ఫిక్స్ చేసుకుంది. దీంతో మూవీ లవర్స్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వచ్చిన వెంటనే చూసేయాల్సిందేనని ఫిక్సయిపోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు ఏ ఓటీటీలో రానుందనే ఇప్పుడు చూసేద్దాం.

టాక్ ఓకే కానీ
శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. పలు డబ్బింగ్ సినిమాలతో మనల్ని అలరిస్తున్న ఇతడు.. గతంలో 'జాతిరత్నాలు' అనుదీప్ తో కలిసి 'ప్రిన్స్' చేశాడు. అది సక్సెస్ కాలేదు. దీంతో తమిళంలో మాత్రమే నటిస్తున్నాడు. అలా జూలై 14న 'మావీరన్' (తెలుగు 'మహావీరుడు')గా థియేటర్లలోకి వచ్చాడు. కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)

ఓటీటీ తేదీ
ఈ సినిమాలో శివకార్తికేయన్ తోపాటు అదితి శంకర్, యోగిబాబు, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ వారం 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది.

కథేంటి?
సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ స్టోరీస్ రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. ఓ సందర్భంలో ఉంటున్న అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి చనిపోవాలనకుంటాడు. దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడతాడు. అప్పటినుంచి అతడికి ఓ అజ్ఞాత గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో సత్య జీవితంలో ఏం జరిగింది? ఈ స్టోరీలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్), మంత్రి ఎమ్ఎమ్ సూర్య(మిస్కిన్) ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్‌గా చేసింది!)

మరిన్ని వార్తలు