యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ అదరగొట్టిన సితార

25 Nov, 2021 14:52 IST|Sakshi

Mahesh Babu Daughter Sitara Dance With Anee Master Goes Viral: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూతురు సితార సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా కొరియోగ్రాఫర్‌, బిగ్‌బాస్‌5 కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులేసింది. డీజే స్నేక్ చార్ట్‌ బస్టర్ ‘టకీ టకీ’అనే పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది.

'యానీ మ్యామ్‌ స్టెప్పులతో రీచ్‌ అవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా రావాల్సి ఉంది' అంటూ సితార ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే సితర డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొడుతుందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

మరిన్ని వార్తలు