Mahesh Babu And KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన మహేశ్‌ బాబు

10 Nov, 2021 17:59 IST|Sakshi

Mahesh Babu Retweet To Minister KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పందించారు. మహేశ్‌ చిత్రం శ్రీమంతుడు మూవీ స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కేటీఆర్‌ నిన్న  ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అది చూసిన మహేశ్‌ కేటీఆర్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ గురించి తెలుసుకున్న ఆయన... శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానంటూ ట్వీట్ చేశారు. అలాగే బీబీపేట్‌ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్‌ రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమంటూ మహేశ్‌ ప్రశంసలు కురిపించారు.

చదవండి: కొరియన్‌ భామతో ప్రభాస్‌ రొమాన్స్‌!

కాగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో  ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ నాయకుడు సుభాష్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలను నిర్మించారు. ఈ స్కూల్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని, సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. పాఠశాల నిర్మాణం కోసం రూ. 6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్త సుభాశ్‌ రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారి నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

చదవండి: ఫాంహౌజ్‌ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్‌

అలాగే శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టించారని ముందే తెలిస్తే.. మహేశ్‌ బాబును ఈ కార్యక్రమానికి తీసుకొచ్చే వాడిని అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు క‌ట్టే జూనియర్ కాలేజ్ పూర్తయిన తరువాత మహేష్ బాబుని తీసుకొద్దాం అని కేటీఆర్ నిన్న జ‌రిగిన మీటింగ్‌లో ఆయన అన్నారట. తన చిత్రం శ్రీమంతుడు స్పూర్తితో పాఠ‌శాల నిర్మించార‌ని ఇక కేటీఆర్‌ ట్వీట్‌తో తెలుసుకున్న మ‌హేశ్‌ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాశ్‌ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం’ అంటూ మహేశ్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు