ఉమెన్స్‌ డేకి మహిళలంతా మొక్కలు నాటండి: నమ్రత

4 Mar, 2023 13:56 IST|Sakshi

పర్యావరణం పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కు విశేష స్పందన లభిస్తోంది. స్టార్‌ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత స్వీకరించారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు.  అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు.

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మరిన్ని వార్తలు