మేజర్‌: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత..

9 Apr, 2021 20:47 IST|Sakshi

మేజర్‌ నుంచి శోభితా ధూళిపాల లుక్‌ రిలీజ్‌

26/11 ముంబై టెర్రరిస్ట్‌ దాడుల్లో మృతి చెందిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్‌". ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ నటిస్తున్నాడు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. ఇటీవలే ఆమె లుక్‌ రిలీజ్‌ చేయగా తాజాగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. "ఉగ్రవాదులు హోటల్‌లోకి చొరబడ్డారు. ఆమె కోసం లోపలకు వచ్చారు. కానీ ఆమె ఎదురు తిరిగి వారితో పోరాడింది" అంటూ ఈ పోస్టర్‌ను ట్వీట్‌ చేశాడు.

అందులో ఆ యువతి పడ్డ వేదనను కళ్లకు కట్టినట్లు చూపించారు. పోస్టర్ చూస్తుంటే ఇది సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాల్లో ఒకటి అని తెలుస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌ 12న టీజర్‌ రిలీజ్‌ కానుండగా జూలై 2న సినిమా విడుద‌ల అవుతోంది. ఇదిలా వుంటే ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శోభితా చివరగా ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో కనిపించింది. ఆ మధ్య వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్‌’ వెబ్‌సిరీస్‌ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది.

చదవండి: హాలీవుడ్‌ సినిమాలో శోభితా దూళిపాళ్ల..

‘మేజర్‌’ అప్‌డేట్‌ : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు