సర్‌ప్రైజ్‌: రవితేజ నెక్ట్స్‌ మూవీపై రేపు స్పెషల్‌ అప్‌డేట్‌

30 Jun, 2021 22:32 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ కొత్త డైరెక్టర్‌ శరత్‌ మాండవతో ఓ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సందర్బంగా ఈ మూవీ జూలై 1వ తేదీ నుంచి సెట్స్‌పైకి రానున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను రేపు విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. రేపు (గురువారం) ఉదయం 10.08 గంటలకు దీనిని నుంచి స్పెషల్‌ అప్‌డేట్‌ను రాబోతుందంటూ తమ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈమూవీలో రవితేజ సరసన మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విరాట‌ప‌ర్వం చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కోలీవుడ్ కంపోజ‌ర్‌ సామ్ సీఎస్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్ర‌స్తుతం ఖిలాడీ సినిమాతో ర‌వితేజ బిజీగా ఉన్నాడు‌. ర‌మేశ్ వ‌ర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోంది. 

మరిన్ని వార్తలు