Malayalam Director Ashokan: మాలీవుడ్‌ దర్శకుడు అశోకన్ కన్నుమూత

26 Sep, 2022 18:14 IST|Sakshi

మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కేరళ  ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ధృవీకరించింది.  ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. కామెడీ చిత్రాల ద్వారా మాలీవుడ్‌లో మంచిపేరు సంపాదించారు.

(చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!)

మలయాళంలో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 1980ల్లో శశికుమార్ దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అశోకన్.. అతని రెండో చిత్రం 'ఆచార్యన్' క్రేజ్ తీసుకొచ్చింది.  మలయాళం కైరాలి టీవీలో ప్రసారమైన  'కనప్పురమున్' 2003లో ఉత్తమ టెలిఫిల్మ్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. అశోకన్ సింగపూర్‌కు మారడానికి ముందు ఇదే చివరి చిత్రం. అ తర్వాత వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. ఆయనకు గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అశోకన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు