-

Malla Reddy: మహేశ్‌బాబు సినిమా 10 సార్లు చూసి ఎంపీనయ్యా.. మల్లారెడ్డి స్పీచ్‌ వైరల్‌

28 Nov, 2023 10:49 IST|Sakshi

అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా మరో వయొలెంట్‌ సినిమాతో ముందుకు వస్తున్నాడు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో యానిమల్‌ మూవీ తెరకెక్కించాడు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మైక్‌ పట్టుకుని ఊగిపోయారు.

ముంబై, బెంగళూరు వద్దు.. హైదరాబాదే బెస్ట్‌..
ఆయన మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు గారు.. నేను మీ బిజినెస్‌మెన్‌ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను. పదిసార్లు ఆ సినిమా చూసే ఎంపీనయ్యాను. సేమ్‌ మోడల్‌.. సేమ్‌ సిస్టమ్‌.. అంతా సేమ్‌! రణ్‌బీర్‌.. మీకో విషయం చెప్పాలి. మరో ఐదేళ్లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంతటినీ ఏలుతుంది. ఏడాది తర్వాత మీరు కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోండి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువుంది. ఇప్పుడు ఇండియాలో అనుకూలంగా ఉన్న ఏకైక నగరం హైదరాబాదే!

తెలుగువాళ్లు తెలివైనవారు
తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు. రాజమౌళి, దిల్‌ రాజు, సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక మందన్నా.. వీరంతా కూడా ఎంతో తెలివైనవారు. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! మీ యానిమల్‌ సినిమా కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది' అని చెప్పుకొచ్చారు. ఈయన స్పీచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. మల్లారెడ్డి.. బాలీవుడ్‌ సెలబ్రిటీల ముందే హిందీ చిత్రపరిశ్రమను రోస్ట్‌ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతిథులుగా వచ్చిన వారిని చులకన చేసి మాట్లాడటం కరెక్ట్‌ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: పెద్ద తప్పు చేసిన అమర్‌, అర్జున్‌.. గేమ్‌ చేతులారా నాశనం చేసుకోవడమంటే ఇదే!

మరిన్ని వార్తలు