త్రిష చుట్టూ మన్సూర్‌ వివాదం.. విచారణకు రెడీ అవుతున్న పోలీసులు

26 Nov, 2023 06:37 IST|Sakshi

వారం రోజులుగా పెద్ద వివాదానికి దారి తీసిన ఘటన ఏదైనా ఉందంటే అది నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశమే. ఈ వ్యవహారంలో పలువురు సినీ తారలు త్రిషకు మద్దతుగా నిలిస్తే కొందరు రాజకీయ నాయకులు మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోరాదంటూ ఆయనకు సపోర్ట్‌ చేశారు. ఇక మహిళా కమిషన్‌ ఈ వివాదంలో కలుగ చేసుకోవడంతో పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి.

ఆ కమిషన్‌ నిర్వాహకులు మన్సూర్‌ అలీ ఖాన్‌ పై డీజీపీకి ఫిర్యాదు చేయడం సమన్లు, విచారణ, కోర్టు పిటిషన్లు వెంట వెంటనే జరిగి పోయాయి. వ్యవహారం ముదిరి పాకాన పడటంతో మన్సూర్‌ అలీ ఖాన్‌ తన పంతాన్ని పక్కన పెట్టి త్రిషమ్మా క్షమించమ్మా అంటూ ఆమె ప్రసన్నం అయ్యేలా మాట్లాడారు. దీంతో త్రిష శాంతి కాముకురాలిగా తప్పులు చేయడం మానవ లక్షణం. క్షమించడం దైవీకం అంటూ పెద్ద పెద్ద డైలాగ్‌తో ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది.

దీంతో ఈ వివాదం సమసి పోయినట్లేనా? అంటే అది ప్రశ్నార్థకంగా మారుతోంది. కారణం మన్సూర్‌ అలీ ఖాన్‌ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురికావడమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు నటి త్రిషను విచారించడానికి సిద్ధం అవుతున్నారు. మరి దీనికి ఎక్కడ ఎండ్‌ కార్డ్‌ పడుతుందో అనే చర్చ సాగుతోంది.

మరిన్ని వార్తలు