నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్‌ కల్నల్‌గా గుర్తింపు

26 Nov, 2023 07:31 IST|Sakshi

సీనియర్ నటుడు నరేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్‌ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్‌' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్‌'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది.

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్‌ సమావేశాల్లో నటుడు నరేశ్‌కు ఈ  అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను  నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ సంస్థతోపాటు ఇంటర్నేషనల్‌ స్పెషల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్‌ కల్నల్‌గా నరేశ్‌ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. 

అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్‌కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. 

ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు