-

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

28 Nov, 2023 16:27 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒకే రేంజ్‌లో ట్రేడయిన మార్కెట్‌ సూచీలు చివరి గంట లాభాల్లో దూసుకెళ్లాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 19,889 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 204 పాయింట్లు పుంజుకుని 66,174 వద్ద స్థిరపడింది.

అమెరికా మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా - పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. దేశీయంగా చూస్తే ఈనెల 30న వెలువడే 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఈవారం సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా. మరోవైపు నవంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు గురువారం ఉంది. 30న జరగనున్న ఒపెక్‌ సమావేశ నిర్ణయాలూ ప్రభావం చూపొచ్చు.

విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) శుక్రవారం రూ.2,625 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.134 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొన్నారు. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 0.5 శాతం తగ్గి 80.13 డాలర్లకు చేరింది.

సెన్సెక్స్‌ 30లో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాన్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీలు లాభాల్లో ట్రేడయ్యాయి. హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
 

మరిన్ని వార్తలు