ఆ కలానికి మార్పుతేవాలనే తపన ఉంది: చిరంజీవి

15 Jun, 2021 15:20 IST|Sakshi

Koratala Siva: హీరో అంటే వందమందిని ఒక్కవేటుతో నరికేవాడు కాదు. ఒక్కమాటతో గొడవను శాశ్వతంగా చల్లార్చేవాడేనని తన పాత్రల ద్వారా నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. సామాజిక కోణంలో సినిమాలు రూపొందిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. నేడు(జూన్‌  15) కొరటాల శివ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. ‘ఆచార్య’ సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 

కొరటాల శివ దర్శకత్వంగా చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రమిది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు.  ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు.

చదవండి:
అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్‌
పెద్ద మనసు చాటుకున్న విజయ్‌ సేతుపతి

మరిన్ని వార్తలు