Waltair Veerayya: 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

18 Dec, 2022 17:10 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌కు మాంచి ట్రీట్‌ ఇస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బాస్ పార్టీ' అంటూ వచ్చిన అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. తాజాగా మరో సింగిల్ పాటను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ పాటను సోమవారం సాయంత్రం 04.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా' అంటూ సాంగ్‌ను చిరు ఇప్పటికే తన ఇన్‌స్టాలో లీక్‌ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్‌ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు