విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి

20 Jan, 2021 09:48 IST|Sakshi

దంపతులు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు విడిపోవడం మంచిదని.. అదేం నేరం కాదంటున్నారు నటి మినిషా లాంబా. ఏడాది క్రితం తాను తన భర్త ర్యాన్ థామ్‌తో విడిపోయిన్నట్లు ప్రకటించిన మినిషా లాంబా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘జీవితం కొనసాగుతూనే ఉంటుంది. సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ఇద్దరి మధ్య బంధం.. అది ప్రేమా, స్నేహమా, వివాహ బంధమా ఏదైనా సరే.. బలంగా లేదనుకొండి.. విడిపోవడం ఉత్తమం. అదేం పెద్ద నేరం కాదు. సంతోషంగా బతకడానికి మనకున్న మార్గం అది’’ అన్నారు. అలానే ‘‘ప్రతి ఒక్కరు ప్రేమను పొందాలని.. దాన్ని ఆస్వాధించాలని ఆశిస్తారు. ఆడవాళ్లు ప్రేమ విషయంలో ఒపెన్‌గా ఉండకూడదా.. గతంలో ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురయ్యి ఉండవచ్చు.. దాంతో ఆమె ప్రేమకు దూరంగా ఉంటానని చెప్తుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎదురుపడినప్పుడు ఆమె ఆ గోడలను బద్దలు కొట్టి.. ప్రేమను ఆహ్వానిస్తుంది’’ అన్నారు మినిషా. (చదవండి: విడాకులు తీసుకోబోతున్న స్టార్‌ కపుల్‌)

మినిషా లాంబా దాదాపు 2 సంవత్సరాల డేటింగ్ చేసిన తర్వాత 2015 సంవత్సరంలో పారిశ్రామికవేత్త ర్యాన్ థామ్‌ను వివాహం చేసుకున్నారు. గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయం వెల్లడించారు. "ర్యాన్, నేను స్నేహపూర్వకంగా విడిపోయాము. చట్టపరమైన విభజన జరిగింది" అని తెలిపారు. తామిద్దరు 2018 అక్టోబర్‌ నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. మినిషా లాంబా, ర్యాన్ థామ్ 2015 జూలై 6 న కోర్టు వివాహం చేసుకున్నారు. తరువాత రిసెప్షన్‌ నిర్వహించగా.. సన్నిహితులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు