డిన్నర్‌కు పిలిచేవారు.. నేను ఒప్పుకునేదాన్ని కాదు: నటి

24 Jun, 2021 10:34 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి నటి మినీషా లంబా పెదవి విప్పింది. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎలా వేళ్లూనుకుపోయిందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "ప్రతి ఇండస్ట్రీలోనూ మగాళ్లు ఉంటారు. సినీ పరిశ్రమలో కూడా అంతే! తమ కనుసన్నల్లో పనిచేసేవారి కోసం కొందరు మగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమా ఆఫర్‌ గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు కొందరు నన్ను డిన్నర్‌కు రమ్మని పిలిచేవారు"

"రాత్రిపూట డిన్నర్‌ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేవారు. కానీ నేనందుకు అసలు ఒప్పుకోలేదు. డిన్నర్‌ కుదరదని, మనం ఆఫీసులోనే మాట్లాడుకుంటే సరిపోతుంది అని ముఖం మీదే చెప్పేసేదాన్ని. అంటే వాళ్లుం ఏం ఆశిస్తున్నారో తెలిసినా నాకేమీ అర్థం కానట్లు నటించేదాన్ని. ఇలా రెండుమూడుసార్లు జరిగాయి. కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు" అని చెప్పుకొచ్చింది.

'యహాన్‌' చిత్రంతో 2005లో వెండితెర అరంగ్రేటం చేసింది మినీషా లంబా. 'బచ్‌నా యే హసీనా', 'కిడ్నాప్‌', 'అనామికా', 'జోకర్‌' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె హిందీ బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లోనూ పాల్గొంది. అదే విధంగా 'తెనాలి రామ', 'ఇంటర్నెట్‌ వాలా' వంటి టీవీ షోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. నటి పూజా బేడీ కజిన్‌ రియాన్‌ను 2015లో పెళ్లాడిన ఆమె 2020లో వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. అయితే విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, తాను మళ్లీ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఇటీవలే వెల్లడించింది మినీషా.

చదవండి: భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు