మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌

2 Oct, 2023 01:49 IST|Sakshi
సూర్య రేవతి, మహేందర్‌ రెడ్డి 

డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది.

ఐదు భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్‌ చిత్రం కాదు.. పబ్లిక్‌ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్‌. 

మరిన్ని వార్తలు