MM Keeravani: ఆర్ఆర్ఆర్‌కు అంతర్జాతీయ అవార్డులు.. ఆయనకు అరుదైన గౌరవం

12 Dec, 2022 16:04 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా లాస్‌ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్ బెస్ట్‌ మ్యూజిక్‌ కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికయ్యారు. మరోవైపు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు. నిర్మాణ సంస్థలు, టాలీవుడ్ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. 

(ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం)

ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్‌లైట్ అవార్డును కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్‌ సర్కిల్‌’, ‘శాటర్న్‌’ అవార్డులూ గెలుచుకుంది. జపాన్‌, అమెరికాలోనూ విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు.

మరిన్ని వార్తలు