‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ రేపు తొలి రిలికల్‌ సాంగ్‌

14 Jun, 2021 08:00 IST|Sakshi

మోహన్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 15న ఈ చిత్రంలోని ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే తొలి లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మోహన్‌బాబు. ఆ ప్రకటన సారాంశం ఈ విధంగా...

 ‘నా కెరీర్‌లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్‌  15న ‘పెదరాయుడు’ రిలీజైన సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత ఈ జూన్‌  15న ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరికల్‌ వీడియో రిలీజ్‌ కావడం శుభసూచికంగా భావిస్తున్నాను. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’కు నా కొడుకు విష్ణువర్ధన్‌ బాబు నిర్మాత కావడం సంతోషదాయకం.

‘పెదరాయుడు’ రిలీజ్‌ అయిన శుభ తరుణాన ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’ చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని మ్యాస్ట్రో ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో రాహుల్‌ నంబియార్‌ గళంతో సాగే లిరికల్‌ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. శ్రీరాముడికి సంబంధించిన ఈ గత్యాన్ని ఆ మర్యాదా పురుషోత్తముడైన ఆయనకే అంకితమిస్తున్నాను’అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు