దుల్కర్‌ సల్మాన్‌తో ‘తూఫాన్‌’ భామ రొమాన్స్‌

2 Aug, 2021 07:51 IST|Sakshi

‘సూపర్‌ 30’, ‘బాట్లా హౌస్‌’, ‘తూఫాన్‌’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మృణాల్‌. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్నా సినిమా బ్యానర్‌పై అశ్వినీ దత్, ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆదివారం మృణాల్‌ ఠాకూర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘హను రాఘవపూడి ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన ప్రేమ కోణాన్ని చూపించబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్‌.వినోద్, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

మరిన్ని వార్తలు