గ్రాండ్‌గా నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

7 Nov, 2022 09:54 IST|Sakshi

నాగశౌర్య హీరోగా ఎస్‌ఎస్‌ అరుణాచలం దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బేబీ అద్వైత, భవిష్య సమర్పణలో వైష్ణవి ఫిలింస్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌ కుమార్‌ చింతలపూడి, డా.అశోక్‌ కుమార్‌ చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్‌ తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహించారు.

న్యూరో హాస్పిటల్‌ సాంబ శివారెడ్డి, ఫ్రాటెక్‌ సంతోష్‌ కుమార్‌ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ చిత్రమిది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలున్నాయి. నాగశౌర్య కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు శౌర్య’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారిస్‌ జయరాజ్, కెమెరా: వెట్రి పళనిసామి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బండి భాస్కర్‌.

మరిన్ని వార్తలు