బీబీ3 టైటిల్‌ వచ్చేసింది..మరోసారి అదరగొట్టిన బాలయ్య

13 Apr, 2021 12:53 IST|Sakshi

సింహా,లెజెండ్‌ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం(బీబీ3) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిల్‌ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బీబీ3 సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రానికి ‘అఖండ’అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. దీంతో పాటు టీజర్‌ని కూడా విడుదల చేశారు. గత సినిమాల మాదిరే సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ కూడా పవర్‌పుల్‌గా ఉంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...' అంటూ బాలయ్య  చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. ఇక ఈ వీడియోలో బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా  మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు