నజ్రియా కోసం చాలా మంది ట్రై చేశారు.. ఎవరి ఫోన్లు లిఫ్ట్‌ చేయలేదు: నాని

20 Apr, 2022 16:30 IST|Sakshi

‘నజ్రియా నజీమ్‌ని తెలుగులోకి తీసుకురావడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ఎవరు ఫోన్‌ చేసినా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. కానీ మా మూవీలో నటించడానికి అంగీకారం తెలిపింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు’అన్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఆయన హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌  హీరోయిన్‌గా నటించిన  తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఏఎంజీలో జరిగిన టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నాని, నజ్రీయాతో పాటు చిత్ర యూనిట్‌ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. వివేక్‌ ఆత్రేయ ఏ సినిమా చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అంత బాగా చెప్పలేరు. టీజర్‌లో చూపించిన దానికంటే రెండు రెట్లు ట్రైలర్‌,  పది రెట్లు సినిమా ఉంటుంది’అన్నారు.

నజ్రియా మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు సినిమా. టాలీవుడ్‌ ఎంట్రీకి ఇదే సరైన కథ అనిపించింది. ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. వీళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్న. ఈ మూవీ కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. నేనే డబ్బింగ్‌ కూడా చెప్పుకున్నాను’అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు