భరతం పట్టడానికి రెడీ

21 Feb, 2021 00:42 IST|Sakshi

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా అదేరోజు ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ మోషన్‌  పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు. ‘‘అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి..’ అంటూ సాగే మెలోడీ డ్యూయెట్‌ లిరికల్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

మరిన్ని వార్తలు