పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నాను.. లిప్‌లాక్‌ ఇస్తూ నరేశ్‌ ప్రకటన.. వీడియో వైరల్‌

31 Dec, 2022 12:21 IST|Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సహచర నటి, స్నేహితురాలు పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్‌ చేస్తూ..‘కొత్త ఏడాది.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశిస్సులు కావాలి. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం’అని నరేశ్‌ పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా నరేశ్‌, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.  ఆ మధ్య నరేశ్‌ మూడో భార్య   రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని గొడవ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కలిసి తిరగడం తగ్గించారు. పవిత్ర సైతం కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఎట్టకేలకు 2023లో నరేశ్‌, పవిత్రలు పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో  విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే నరేశ్‌ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు