ఆ రోజు థియేటర్స్‌లో అన్నపూరణి

2 Nov, 2023 04:12 IST|Sakshi

అన్నపూరణిగా థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు హీరోయిన్‌ నయనతార. ఆమె కెరీర్‌లో రూ΄÷ందుతున్న 75వ సినిమా ‘అన్నపూరణి’ (తెలుగులో ‘అన్నపూర్ణ’ అని అర్థం). ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఉపశీర్షిక. జీ స్టూడియోస్, నాడ్‌ స్టూడియోస్, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ నిర్మాణ భాగస్వామ్యులుగా ఉన్న ఈ సినిమాకు నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, ఓ ΄ోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఫుడ్‌.. ఫన్‌.. ఎమోషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు