పూజా హెగ్డే ఇంట్లో స్పెషల్‌ నైట్‌ పార్టీ

18 Apr, 2021 16:40 IST|Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. తాజాగా ఈ భామ రాత్రిపూట ఓ పార్టీని ఏర్పాటు చేసింది. అదీ తనను పెంచి పెద్ద చేసిన తండ్రి కోసం. పూజా తండ్రి మంజునాథ్‌ 60వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఇంట్లోని ఓ గదిని అంతా బెలూన్లతో అలంకరించింది. పూజా స్వయంగా చేసిన ఈ అలంకరణలను చూసి ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేసి పూజను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇక పనిలో పనిగా ఫ్యామిలీ కోసం కచేరీ కూడా పెట్టించిందీ భామ. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మొత్తానికి బర్త్‌డే పార్టీలో ఫ్యామిలీ అంతా ఓ రేంజ్‌లో రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా వుంటే తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ ప్రస్తుతం 'రాధేశ్యామ్‌', 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తోంది. తమిళ హీరో విజయ్‌ 65వ సినిమాలో కూడా పూజా హీరోయిన్‌గా కనిపించనుంది. హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న 'సర్కస్‌'లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

చదవండి: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ అలా మొదలవుతుంది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు