‘ఆదిపురుష్‌’పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

14 Apr, 2021 11:18 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్పీడ్‌ పెంచాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ఒకేసారి మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. అవన్ని కూడా పాన్‌ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఇటీవల ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ప్రభాస్‌.. ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.  ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కరోనా కారణంగా ఆదిపురుష్‌ షూటింగ్‌ ఆగిపోయింది’ అని ఆ వార్త సారాంశం.

అయితే తాజగా ఈ వార్తపై దర్శకుడు ఓం రౌత్‌ స్పందించాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తగా అవాస్తవమైనదని, షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పాడు. ‘ఆదిపురుష్‌’ టీమ్‌లో ఒకరికి కరోనా వచ్చిందనే వార్తను కూడా పూర్తిగా ఖండించాడు. సెట్‌ ఇప్పటి వరకు ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ జరుపుకుంటున్నామని చెప్పాడు. 

ఇక రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.
చదవండి:
బండ్ల గణేశ్‌కి మళ్లీ కరోనా.. ఐసీయూలో చికిత్స!
ఎన్టీఆర్‌ ఎఫెక్ట్‌.. బన్నీ సినిమా ఆగిపోయిందా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు