‘ఆస్కార్‌ రావడమే శాపం’

27 Jul, 2020 11:52 IST|Sakshi

బాలీవుడ్‌ పరిశ్రమలో ఒక గ్యాంగ్‌ తన గురించి దుష్ప్రచారం చేస్తూ తనకు ఆఫర్స్‌ రాకుండా చేస్తున్నారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెహమాన్‌ అనంతరం ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ రేసుల్ పూకుట్టి కూడా తన ఆవేదనను బయట పెట్టారు. ఆస్కార్‌ గెలుచుకున్న తరువాత బాలీవుడ్‌లో అవకాశం ఇవ్వడానికి ఎవరు ఆసక్తి చూపలేదని తెలిపారు. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదని ముఖం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ  తనకి బాలీవుడ్‌ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమేనని పేర్కొన్నారు. 

రెహమాన్‌ చేసిన వ్యాఖ్యలపై శేఖర్‌ కపూర్‌ స్పందిస్తూ రెహమాన్‌ ‘నీ సమస్య ఏంటో నీకు తెలుసు, నువ్వు స్కార్‌ గెలుచుకున్నావు. ఆస్కార్‌ అంటేనే బాలీవుడ్‌లో చనిపోవడానికి ముద్దు పెట్టడం లాంటిది. దాని అర్థం నువ్వు బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేసేదాని కంటే ఎక్కువ టాలెంట్‌ కలిగి ఉన్నావు’ అని ట్వీట్‌ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు రేసుల్‌ పూకుట్టి స్పందిస్తూ,  ‘శేఖర్‌ దాని గురించి నన్ను అడగండి. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న తరువాత నాకు పరిశ్రమలో అవకాశాలు రాలేదు. దాంతో నేను కుంగిపోయాను. తరువాత నాకు ఆస్కార్‌ శాపం గురించి తెలిసింది. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదు అని ముఖం మీదే చెప్పారు. కానీ నాకు ఈ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమే’ అని చెప్పారు. 

దిల్‌ బచరా విడుదల తరువాత మీరు బాలీవుడ్‌లో ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడంలేదు అని ఏఆర్‌ రెహమాన్‌ను ఒక ఇంటరర్వ్యూలో  ప్రశ్నించగా, ‘నేను ఎప్పుడు మంచి సినిమాలకు చేయను అని చెప్పలేదు. కానీ కొంత మంది గ్యాంగ్‌ నా మీద రూమర్స్‌ సృష్టి‍స్తున్నారు. దీంతో అవకాశాలు రావడం లేదు’ అని రెహమాన్‌ చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ​ 

చదవండి: నీ ప్రతిభను బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేయలేదు

మరిన్ని వార్తలు