Godfather OTT Streaming: ఓటీటీకి వచ్చేసిన గాడ్‌ ఫాదర్‌, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

19 Nov, 2022 12:31 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్‌ ఫాదర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. మలయాళ డైరెక్టర్‌ మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌లు కీ రోల్‌ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్‌ దర్శక-నిర్మాతలు

నవంబర్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. శుక్రవారం అర్థరాత్రి నుంచి గాడ్‌ ఫాదర్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

చదవండి: బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ షాకిచ్చిన హీరోయిన్‌, ఫొటోలు వైరల్‌

మరిన్ని వార్తలు