సీనియర్‌ నటి రాజ్యలక్ష్మి తనయుడు హీరోగా ఎంట్రీ

10 Jan, 2022 08:35 IST|Sakshi

రోహిత్‌ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పల్లెగూటికి పండగొచ్చింది’. తిరుమల్‌ రావు దర్శకత్వం వహించారు. కె.ప్రవీణ్‌ సమర్పణలో  కె.లక్ష్మి నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. తిరుమల్‌ రావు మాట్లాడుతూ– ‘‘గ్రామీణ యువత ఏ రకంగా చెడు మార్గంలో వెళుతున్నారు? వారు మంచి మార్గంలో నడిస్తే ప్రభుత్వ సహకారం లేకుండానే గ్రామాన్ని ఎలా స్మార్ట్‌గా అభివృద్ధి చేయొచ్చన్నదే కథాంశం’’ అన్నారు.

‘‘ఈ చిత్రంలో మా అబ్బాయి రోహిత్‌ కృష్ణ హీరోగా నటించాడు. ఫిబ్రవరిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేశాం’’ అన్నారు రాజ్యలక్ష్మీ . ‘‘సుమన్, సాయి కుమార్, సాయాజీ షిండే, రఘుబాబు, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్‌ నటులతో నటించే అవకాశం కల్పించిన తిరుమల్‌ రావుకు «థ్యాంక్స్‌’’అన్నారు రోహిత్‌ కృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: సింధు కే ప్రసాద్, కెమెరా: రవి టి.
 

మరిన్ని వార్తలు