అదే జరిగితే మెగా అభిమానులకు పండగే

18 Jan, 2021 19:16 IST|Sakshi

శంకర్‌ దర్శకత్వంలో బాబాయితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న చెర్రి?

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలు, మల్టీ సార్టర్‌ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేక్షకులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు మరింత కిక్కెచ్చే న్యూస్‌ ఒకటి ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. రామ్‌ చరణ్ ఇప్పటికే మెగస్టార్‌ చిత్రాల్లో మెరిశారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఆచార్య చిత్రంలో సిద్ధ పేరుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలిసిన షాకింగ్‌ అండ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటంటే పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌లు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారట. మరో సర్‌ప్రైజ్‌ ఏంటంటే ఈ చ్రితానికి భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: పవన్‌కు త్రివిక్రమ్‌ మాట సాయం)

ప్రస్తుతం శంకర్‌ డైరెక్ట్‌గా తెలుగు సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇందుకు గాను లాక్‌డౌన్‌లోనే కథలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్‌కి, చరణ్‌కి స్టోరీ నరేట్‌ చేశారని.. వారిద్దరూ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. దాంతో బాబాయి- అబ్బాయి ఇద్దరు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తారని.. పవన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. మెగా అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్‌‌‌, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మాళయాళంలో సూపర్‌ హిట్టైన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ మూవీని దర్శకుడు సాగర్‌ కే చంద్ర తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు