పవన్‌ బర్త్‌డేకు సిద్దమవుతోన్న భీమ్లా నాయక్‌ ఫస్ట్‌ సింగిల్‌

30 Aug, 2021 20:54 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందడి ముదలైంది. సెప్టెంబర్‌ 2 ఆయన పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వరుసగా రానున్నాయి. దీంతో తమ అభిమాను హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఉండబోతుంది. ఇదిలా ఉండగా పవన్‌ ప్రస్తుతం హరిహర వీరమల్లు, బిమ్లా నాయక్‌తో పాటు పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆయన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ రాబోతుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా మేకర్స్‌ ప్రకటించారు.

చదవండి: ఆకట్టుకుంటున్న ‘అనబెల్‌..సేతుపతి’ ట్రైలర్‌

సెప్టెంబర్‌ 2వ తేదీన ఈ పాటను రిలీజ్‌ చేయబోతున్నట్లుగా స్పష్టం చేస్తూ పోస్టర్‌ వదిలారు. ‘పవన్ పుట్టిన రోజున ఉదయం 11:16 గంటలకు ఫస్ట్‌ సింగిల్‌గా టైటిల్ సాంగ్‌ విడుదల చేయబోతున్నాం’ అంటూ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. కాగా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌ పోలీసు ఆఫీసర్‌గా మరోసారి అలరించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

చదవండి: ‘బాహుబలి’తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు

మరిన్ని వార్తలు