ప్రభాస్‌ అభిమానులకు ‘రాధే శ్యామ్’‌ డైరెక్టర్‌ హామీ

6 Jan, 2021 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘డార్లింగ్’‌ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ఓ ప్రామిస్‌ చేశాడు. (చదవండి: రాధే శ్యామ్‌ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించే యోచన)

‘టీజర్‌ అప్‌డేట్‌ త్వరలోనే మీ ముందుకు రానుంది. అంతవరకూ కాస్తా ఓపిక పట్టండి. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఇది మీ మొహంలో చిరునవ్వులు చిందిస్తుందని ఆశిస్తున్న’ అంటూ ట్వీట్‌ చేశాడు. అత్యధిక భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.  పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన  పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సంక్రాంతికి సర్‌ప్రైజ్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు