Priyanka Chopra: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్‌ కామెంట్‌

19 Nov, 2021 18:59 IST|Sakshi

Priyanka Chopra Shares The Matrix Resurrections New Poster: హాలీవుడ్‌ 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా 'ది మ‍్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌' కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ పోస్టర్‌లో హాలీవుడ్‌ స‍్టార్‌ కీన్‌ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్‌, జడా పింకెట్‌ స్మిత్‌, యహ్యా అబ్దుల్‌ మాటీన్‌ 2, జోనాథన్‌ గ్రోఫ్‌ ఉన్నారు. ఈ పోస‍్టర్‌ షేర్‌ చేస్తూ ప్రియాంక 'ఈ మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్‌కి థియేటర్‌లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి.' అని రాసుకొచ్చింది. 

A post shared by Priyanka (@priyankachopra)

భారతీయ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్టర్‌లో ప్రియాంక కనిపించకపోయేసరికి ప్రశ్నలు కురిపించిసాగారు. 'పోస్టర్‌లో మీరు ఎక్కడ ఉన్నారు' అని ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. 'మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని మరోకరు రాశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అందులో ప్రియాంక నల్లటి షేడ్స్‌ ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్‌ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాల‍్గో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్‌ 22న థియేటర్స్‌, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. 


మరిన్ని వార్తలు