`సూర్యాస్త‌మ‌యం` చేయడం గర్వంగా ఉంది

28 Aug, 2021 19:51 IST|Sakshi

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం `సూర్యాస్త‌మ‌యం`. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. 

ఈ సందర్భంగా నిర్మాత  క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్త‌మ‌యం` సినిమా చేయ‌డానికి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి  మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు  అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్‌ రెడ్డి.  ప్రొడ్యూసర్‌ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు