ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్‌బాబు

23 Apr, 2021 14:22 IST|Sakshi

అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ జంటగా నటించారు. మలయాళంలో డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్‌ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌తో రీమేక్‌ చేశారు. ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేశ్‌ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 
చదవండి:
ఈ వీకెండ్‌లో ఓటీటీలో రిలీజ్‌‌ అయ్యే సినిమాలివే..
హాట్‌ టాపిక్‌గా మారిన పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌

మరిన్ని వార్తలు