-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి పెళ్లిపీటలెక్కగా ఓ వారం రోజుల్లో కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా పెళ్లిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్ అభిషేక్ పాఠక్, కుదా హఫీజ్ హీరోయిన్ శివలేఖ ఒబెరాయ్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట! ఇదే విషయాన్ని నటి హింటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఆకాశంలో అన్ని నక్షత్రాలుండగా, సముద్రం ఒడ్డున ఇన్ని నక్షత్ర చేపలుండగా అతడు మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా నావైపే చూస్తున్నాడు' అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో అభిషేక్ ముఖం కనిపించకుండా బ్లర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అభిషేక్ పాఠక్- శివలేఖ గోవాలో పెళ్లి చేసుకోనున్నారంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా శివలేఖ ఒబెరాయ్ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi) చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు -
ఓటీటీలో అజయ్ దేవ్‌గణ్ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం 2', కానీ ఓ ట్విస్ట్
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, హీరోయిన్ శ్రియ జంటగా నటించిన చిత్రం దృశ్యం 2. మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించారు. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా తాజాగా ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయంపై అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. 'మా సినిమాను థియేటర్లలో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకుడైనా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. కాగా దృశ్యం చిత్రాన్ని దివంగత డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన ఏడేళ్లకు సీక్వెల్ రాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లదాకా కలెక్షన్లు రాబట్టింది. unfold the mystery 🌀#Drishyam2OnPrime, watch now!https://t.co/w8sKUEdkHg pic.twitter.com/8NYDcXvTau — prime video IN (@PrimeVideoIN) January 13, 2023 చదవండి: ఇడియట్, వెళ్లు.. అంటూ నా భార్య ముందే నాన్న కోప్పడ్డారు: రామ్‌చరణ్ నటుడితో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement