Puneeth Rajkumar: పునీత్‌ సమాధిని దర్శించేందుకు ఫ్యాన్స్‌కు అనుమతి

3 Nov, 2021 10:37 IST|Sakshi

కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని దర్శించేందుకు నేటి నుంచి అభిమానులకు అవకాశం కల్పించారు. శుక్రవారం పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మణంతో కన్నడిగులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానుల దర్శనార్థం కంఠీరవ సూడియోలో పునీత్‌ పార్థీవదేహన్ని ఉంచారు. కడసారి తమ అభిమాన హీరోని చూసేందుకు లక్షల్లో అభిమానులు తరలివచ్చారు.

చదవండి: పునీత్‌ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌, ఇవే అప్పు చివరి క్షణాలు!

ఇక మంగళవారం పునీత్‌ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పూజ అనంతరం ఆయన అన్న, హీరో శివ రాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. అభిమానుల కోరిక మేరకు బుధవారం నుంచి పునీత్‌  సమాధి సందర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు