Sukumar: బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింద‌న్న సుకుమార్‌

15 Jan, 2022 18:30 IST|Sakshi

Sukumar Bollywood Debut: పుష్ప సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఆర్య‌, ఆర్య 2ల‌తో బ‌న్నీకి హిట్ ఇచ్చిన ఆయ‌న పుష్ప‌తో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందించాడు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప మేనియా న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో సుకుమార్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు. బాలీవుడ్‌లో త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు.

'నేను ఓ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా అక్ష‌య్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. ముంబైకి రా, నీతో క‌లిసి ప‌ని చేయాల‌ని అన్నాడు. ఇది ఈ మ‌ధ్యే జ‌రిగింది. మంచి స్క్రిప్ట్ కుదిరితే త‌ప్ప‌కుండా ఆయ‌న‌తో సినిమా చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా అక్ష‌య్ ఇటీవ‌లే పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేసిన‌ విష‌యం తెలిసిందే!

మరిన్ని వార్తలు